అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక వెన్నెముక స్క్రీనింగ్ ప్యాకేజీ
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : ప్రపంచ వెన్నెముక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో వెన్నెముక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజీని ప్రారంభించింది. బుధవారం ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ న్యూరో సర్జన్లు డాక్టర్ ఏ.వి. రమణమూర్తి, డాక్టర్ కె. వెంకట్, డాక్టర్ ఒబెద్ అహ్మద్ మాట్లాడుతూ.. ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, తప్పుడు భంగిమలు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెడ, నడుము, వెన్నునొప్పి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. దీర్ఘకాలిక నొప్పులు, కాళ్లు లేదా చేతుల్లో తిమ్మిర్లు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, సరైన వ్యాయామం చేయడం ద్వారా భవిష్యత్తులో తీవ్ర సమస్యలను నివారించవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం అక్టోబర్ 31వ తేదీ వరకు కేవలం రూ. 4,999కే ప్రత్యేక వెన్నెముక స్క్రీనింగ్ ప్యాకేజీని అందిస్తోంది. వైద్యుల సూచనల మేరకు ఈ ప్యాకేజీలో ఆర్బీఎస్, సీరం క్రియాటినిన్, హిమోగ్లోబిన్ , ఈఎస్ఆర్ రక్త పరీక్షలతో పాటు ఎల్ఎస్/సి-స్పైన్ ఎక్స్రే, ఎంఆర్ఐ స్పైన్ స్క్రీనింగ్, న్యూరో సర్జరీ, ఫిజియోథెరపీ కన్సల్టేషన్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.