BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

అనుమతులు లేకుండా టేకు చెట్లు నరికివేతపై ఫిర్యాదు

Select Suryaa Now
అనుమతులు లేకుండా టేకు చెట్లు నరికివేతపై ఫిర్యాదు
  • సీతంపేట తహసీల్దార్‌పై సీతానగరం తహసీల్దార్‌ కు, పీజీఆర్‌లో ఫిర్యాదు.

సీతానగరం:  ఆమె ఒక  మండల తహసిల్దార్ ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాల్సిన ఆమె. ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కి. సాక్షాత్తు ఆమె దగ్గరుండి అనుమతులు లేకుండా టేకు చెట్లు నరికి వేస్తూ అడ్డొచ్చిన గ్రామస్తులపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ దిక్కునచోట చెప్పుకోమంటుంతో ఈ ఘటనపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సీతానగరం మండలం నిడగల్లు పంచాయతీ పరిధిలోని ముత్యాలవలస(జగన్నాధపురం) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
గ్రామస్తుల కథనం ప్రకారం.. ముత్యాలవలసలోని సర్వే నంబర్ ఎల్‌పీ 1/1.5/1 పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికివేసినట్లు ఆరోపించారు. తమ అనుమతి లేకుండా తమ తోటలోని టేకు చెట్లను నరికివేయడంపై స్థానికులైన జమ్ము పోలీస్. జమ్ము గంగరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రశ్నించగా, ‘ఎవరికైనా చెప్పుకోండి’ అంటూ సమాధానం ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమపై దౌర్జన్యంగా వ్యవహరించినట్లు కూడా వారు ఆరోపించారు.
సర్వే నంబర్ 1/1లో నాలుగు టేకు మొక్కలతో పాటు మరో సర్వే నంబర్‌ 5/1 కు సంబంధించిన మొక్కను అలాగే కోర్టు వివాదాల్లో ఉన్న తోట నుండి మరో చెట్టును నరికివేయడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత తహసీల్దార్‌పై సీతానగరం తహసీల్దార్‌, జిల్లా కలెక్టర్ నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్)లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదు నేపథ్యంలో తహసీల్దార్ పి. ప్రసన్నకుమార్ క్షేత్రస్థాయి పరిశీలనకు ఆర్‌ఐ శ్రీనివాసుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో ఆర్‌ఐ తన సిబ్బందితో కలిసి ముత్యాలవలస గ్రామానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలతో నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆర్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
టేకు చెట్ల నరికివేతకు సంబంధించి అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరికివేశారా? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవడంతో పాటు దురుసుగా ప్రవర్తించిన సీతంపేట  తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు