BREAKING
రెండు రోజుల్లో 341 నామినేషన్లు స్వీకరణ హీట్ పెంచిన దండుగోపాలపురం రాజకీయం భారీ వర్షాల హెచ్చరిక.. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి.. మేయర్ పీఠంపై కూటమి జెండా ఎగరడం ఖాయం.. నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలకు శ్రీకారం మంత్రి అచ్చెన్నాయుడుతో ఎంపీటీసీల భేటీ నామినేషన్ కేంద్రాల్లో వసతులపై ఆరా ములగ సాగుతో అదనపు ఆదాయం పొందాలి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా రేణుక సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ పగ్గాలు అడ్వకేట్ గడ్డం రేణుకకు అంతర్జాతీయ వేదికపై టెక్కలి క్రీడాకారుల గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు చెట్టుపై నుంచి కాలుజారి చెరువులో పడి వృద్ధుడు మృతి చినవంకలో కూటమికి జన జాతర. పేదవారికి చేయూతనే పింఛన్ అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వం సర్పంచ్ షాబుద్దీన్ వైసీపీని వీడి టీడీపీలో చేరిన 30 కుటుంబాలు మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో చింతు శకుంతల..

అనంతేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా కోటి సోమవారం వేడుకలు

Select Suryaa Now
అనంతేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా కోటి సోమవారం వేడుకలు

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి :-అనంతపురం బెంగళూరు రోడ్డులోని శ్రీ  శివ బాలయోగి మహరాజ్ ఆశ్రమం ప్రాంగణంలో ఉన్న శ్రీ అనంతేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా కోటి సోమవారం వేడుకలను సోమవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం శ్రీ అనంతేశ్వర స్వామివారికి భక్తులు స్వయంగా రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా లింగాష్టకం, శివాష్టకం, బిల్వాష్టకం, శివతాండవ స్తోత్రం, విశ్వనాథాష్టకం, దారిద్ర్య దహన శివ స్తోత్రం, శివ చాలీసా, శివ పంచాక్షర స్తోత్రం తదితర శివ స్తోత్రాలను భక్తులు పారాయణం చేశారు.
అనంతరం 108 బాణలింగాలకు మహిళలు భస్మాభిషేకం నిర్వహించడంతో పాటు స్వయంగా స్వామివారికి హారతి సమర్పించారు. తదుపరి మహా మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిపారవశ్యంలో శివనామస్మరణ చేశారు. ఆశ్రమ మహిళా మండలి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ అధ్యక్షులు జూటూరు అరవింద్, జూటూరు జ్యోతి, ఉపాధ్యక్షులు రత్నగిరి దేవరాజు, కోశాధికారి సి.ఎస్. ప్రసాద్, కార్యదర్శి కలవల మల్లికార్జున, చిప్పగిరి సురేష్, లక్ష్మీనారాయణతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..