అనంతపురం నగరపాలక సంస్థలో మీడియా ధృవీకరణ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు.
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:-అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కింది అంతస్తులో, పన్నుల విభాగం 12వ గదిలో మీడియా ధృవీకరణ, పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
గుర్తింపు పొందిన లేదా నమోదైన రాజకీయ పార్టీలు, వ్యక్తిగత అభ్యర్థులు తమ రాజకీయ ప్రకటనలకు ధృవీకరణ పొందేందుకు, ప్రకటనల ప్రసారం లేదా ప్రదర్శన ప్రారంభానికి కనీసం మూడు రోజుల ముందుగా నియమిత కమిటీకి దరఖాస్తు సమర్పించాలి.
దరఖాస్తును నిర్దేశిత నమూనాలో సమర్పించడంతో పాటు, ప్రతిపాదిత ప్రకటనకు సంబంధించిన రెండు ప్రతులు, ధృవీకరించిన లిఖిత రూపాన్ని జత చేయాలి. చెల్లింపు వార్తలపై జిల్లా స్థాయి మీడియా ధృవీకరణ, పర్యవేక్షణ కమిటీ నిఘా ఉంచుతుందన్నారు.