అనారోగ్యంతో బాధపడుతున్న కామసాని శేషిరెడ్డి పరామర్శ
-అండగా నిలుస్తామన్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
కొనకనమిట్ల, మేజర్ న్యూస్;
అనారోగ్యంతో బాధపడుతూ ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొనకనమిట్ల మండలం నాగరాజుకుంట గ్రామానికి చెందిన కామసాని శేషిరెడ్డిని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్, గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు పరామర్శించారు.శేషిరెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆయన, తన బిజీ షెడ్యూల్ మధ్యలోనూ ఆసుపత్రికి చేరుకున్నారు. శేషిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, ఆయనకు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడారు. పార్టీ శ్రేణులు, నాయకులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని శేషిరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.