అమలాపురం డీఎల్పీవో గా సూరపరాజు... అమలాపురం మేజర్ న్యూస్
అమలాపురం డీఎల్పీవో గా సూరపరాజు...
అమలాపురం మేజర్ న్యూస్ డివిజనల్ పంచాయతీ అధికారిగా రుద్రరాజు ఎస్ ఎస్ సూరపరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు.మలికిపురం మండలం డిప్యూటీ ఎంపీడీవో గా పనిచేస్తున్న సూరపరాజుకు డీఎల్పీవో గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.డీఎల్పీవో గా బాధ్యతలు స్వీకరించిన సూరపరాజును విశ్రాంత డీఎల్పీవో పి.బొజ్జిరాజు, డిప్యూటీ ఎంపీడీవోలు టీడీఏ శాస్త్రి,టి.అచ్చిరాజు,గరిమెళ్ల రవి,
పంచాయతీ కార్యదర్శులు దీపాటి సురేష్,సింగంపల్లి దుర్గా శ్రీను,ఎన్ ఆర్ కే రాజు, పి.ఆదినారాయణ,పి.శ్రీనివాస్,
ఆర్.సత్యనారాయణరాజు బుజ్జిరాజు,పంపన శ్రీనివాస్,ఏ ఎస్ వీ ఎస్ రాజేశ్వరరావు రాజా,నల్లా సతీష్,ఐవీసత్యనారాయణ రాజు,దారా రామకృష్ణ,పి.సత్తిబాబు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
*రంబాల సత్యనారాయణ మేజర్ న్యూస్ అమలాపురం