BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

అక్టోబర్ 11 నుండి ప్రశాంత్ నగర్ నందు నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
అక్టోబర్ 11 నుండి ప్రశాంత్ నగర్ నందు నవరాత్రి ఉత్సవాలు


- శ్రీరామ్ చినబాబు,సీడ్స్ మల్లికార్జున నాయుడులకు ఆహ్వానం 
మదనపల్లె : పట్టణంలోని ప్రశాంతనగర్ నందు నిర్వహించ తలపెట్టిన శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు,టీడీపీ సీనియర్ నాయకులు సీడ్ మల్లికార్జున నాయుడులను ఉత్సవ కమిటీ సభ్యులు సోమవారం ఆహ్వానించారు.ప్రశాంత్ నగర్ నందు అక్టోబర్ 11 నుంచి 21 వరకు నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ఉత్సవాలకు పట్టణంలోని ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు.ప్రజలు శ్రీ దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రశాంత్ నగర్ నందు దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు.యువత ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలన్నారు.అమ్మవారి ఆశీస్సులతో ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.దసరా ఉత్సవాలకు తప్పక హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ,వెంకట్ రెడ్డి,నరేష్ కుమార్,అఖిలేష్,యోగి,దివాకర్,మురళి తదితరులు పాల్గొన్నారు.