BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

ఐటీడీపీ ర్యాంకుల్లో లక్ష్మీకాంత్‌ రెడ్డి సత్తా

Select Suryaa Now
ఐటీడీపీ ర్యాంకుల్లో లక్ష్మీకాంత్‌ రెడ్డి సత్తా

 

రాష్ట్రస్థాయిలో టాప్‌–100.. పాతపట్నం నియోజకవర్గంలో ప్రథమ స్థానం
మెలియాపుట్టి. ఐటీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న మెలియాపుట్టి గ్రామానికి  చెందిన దుక్క లక్ష్మీకాంత్‌ (శంకర్‌) రెడ్డి గుర్తింపు పొందారు. రాష్ట్రస్థాయిలో టాప్‌–100 ర్యాంకు సాధించడంతో పాటు పాతపట్నం నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ సెషన్‌లో భాగంగా లక్ష్మీకాంత్‌ రెడ్డికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును నేరుగా కలిసే అవకాశం లభించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడం, అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించడంలో ఆయన చూపిన చొరవకు ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచింది.
ఈ సందర్భంగా లక్ష్మీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత పట్టుదలతో పనిచేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.