అధ్వానంగా ఎస్ టు రోడ్డు ప్రజలకు తప్పని తిప్పలు
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నిత్యం జనసంచారం ఉండే ఎస్ టూ రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ ప్రాంతంలో లా కాలేజీ, వి ఆర్ మున్సిపల్ జూనియర్ కాలేజీ, మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూలు ఉన్నాయి. అదేవిధంగా ఆసుపత్రులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఉన్న సైడ్ కాలవలు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు నిత్యం అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోడ్డు మార్గంలో మురికి నీరు సైడ్ కాలవల నుంచి రోడ్లన్నీ జలమయంగా చేస్తున్నాయి. దీంతో ఈ మార్గంలో నడిచే పాదాచారులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, రోగులు పడే అవస్థలు వర్ణాతితం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మురికి నీరు సైడ్ కాలువ సక్రమంగా లేక రోడ్లపై ప్రవహిస్తుండడంతో అటు వాహనదారులు కూడా నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతంలో సైడ్ కాలవలు సక్రమంగా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నగర పాలక సంస్థ పరిధిలోని పాత 45వ డివిజన్ లో ఉన్న ఈ ప్రాంతంలో సైడ్ కాలవలు దుర్భరంగా ఉన్నాయి. దీంతో వివిధ హాస్పిటల్స్ నుంచి అక్కడ ఉన్న మురికి నీరు చేరి నిత్యం రోడ్లపై జలమయంగా మారాయి. ఇక వర్షం వచ్చిందంటే ఈ ప్రాంతంలో నడవాలంటే నరకమే అని చెప్పవచ్చు. కనీసం ఏ ఒక్క అధికారి కూడా ఈ ప్రాంతంలో ఈ విధంగా ఉన్నప్పటికీ దానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసిన వారు లేరని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.