BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

అధికారుల నిర్లక్ష్య ధోరణితో భక్తులలో పెరిగిన అసహనం

Select Suryaa Now
అధికారుల నిర్లక్ష్య ధోరణితో భక్తులలో పెరిగిన అసహనం
  • సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు 
    పాలకొండ, సూర్య: పాలకొండ శ్రీ కోట దుర్గ అమ్మవారి దసరానవరాత్రి ఉత్సవాలు లో అధికారుల నిర్లక్ష్యం కనపడింది. అమ్మ వారి నిజ రూపం దర్శనం అంటే సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కొన్ని దశాబ్దాల కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా లెక్కకు మించిన భక్తులు వేరువేరు ప్రాంతాల నుండి తరలివచ్చారు. అయితే సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం, గతంలో ఇక్కడి అధికారులు ఒక ప్రత్యేక మైన ప్రణాళికతో వారికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కృషి చేసేవారు. అయితే ప్రస్తుతం ఆలయ అధికారులకు కనీస పరిజ్ఞానం కూడా లేకపోవడంతో, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులే కాకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ముఖ్యంగా ఆలయ సిబ్బంది బంధువులు, మిత్రులు, రాజకీయ నేతలు అంటూ వారికి నచ్చిన వారిని ఇతర ప్రవేశ ద్వారం నుండి లోనికి అనుమతించడంతో, క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు గంటలు కొలది అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. క్యూలైన్లో ఉండే భక్తుల కోసం అందించే మజ్జిగ ప్యాకెట్లు వంటివి కూడా అరకొరగానే అందించటంతో, అనేకమంది అడిగి విసిగి వేసారి పోయారే తప్ప వారికి అందలేదని ఆరోపణలున్నాయి. మరీ ముఖ్యంగాదేవాదాయ శాఖ అధికారులు అధికారులు, భక్తుల సౌకర్యాలకన్నా, కలెక్షన్ల పైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు నవరాత్రి ఉత్సవ వేడుకల్లో విస్తృతంగా ప్రచారంజరిగింది. ఎందుకు కారణం కూడా లేకపోలేదు. 100 రూపాయల టిక్కెట్ కౌంటర్ వద్ద, సాంకేతిక లోపం కారణాన్ని చూపిస్తూ, అధిక సమయం చిత్తుకాగితాలపై పెన్నులతో  100 రూపాయలు అని రాసి భక్తుల దగ్గర నగద వసూలు చేసి స్లిప్పులు ఇవ్వటంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. అలాగే ప్రసాదలు విక్రయం లో బిల్లులు లేకుండా అమ్మకాలు జరపడం తో అనేక అనుమానులకు తావిస్తోంది.ఇలా లెక్క జమా లేకుండా చేసిన కలెక్షన్ ఎంత? అది ఎవరికి చెందుతుంది?. అలా విక్రయించుకునేందుకు ఎవరైనా అనుమతులు జారీ చేశారా అనే సందేహాలు సర్వత్ర వినిపిస్తున్నాయి. అధికారులు ఉత్సవాల నిర్వహణలో కేవలం కలెక్షన్ల పైనే కాకుండా భక్తుల ప్రయోజనాలపై కూడా శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయినప్పటికీ స్థానిక అధికారుల వైఖరి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండటం ఎవరికైనా సందేహం కలిగించక మానదు.