BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అయితేనే గ్రామాల అభివృద్ధి.

Select Suryaa Now
అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అయితేనే గ్రామాల అభివృద్ధి.

 

రావికమతం - నవంబర్ 28, మేజర్ న్యూస్:

గుడ్డిప సర్పంచ్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మజ్జిగ  మంగ  భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే  మంగకు 1050  ఓట్లు పోలవ్వగా  సమీప వైఎస్ఆర్సిపి అభ్యర్థికి 502. ఓట్లు మాత్రమే. వచ్చాయి. ఇటీవల రద్దయిన పంచాయతీ పాలకవర్గంలో  వైఎస్ఆర్సిపి కి చెందిన  గుమ్మాల గణేష్ సర్పంచ్ గా ఐదేళ్లు వ్యవహరించారు. ఈ సమయంలో పంచాయతీలో జరిగిన అభివృద్ధి కి ప్రజలు మద్దతు తెలుపుతారని ఈ ఎన్నికల్లో అడ్డూరి సాయి దుర్గ  ను సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దింపారు. వైఎస్ఆర్సిపి సర్పంచ్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ప్రధాన ప్రచారాస్త్రంగా కూడా తీసుకున్నారు. అయినప్పటికీ భారీ తేడాతో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఓటమి  పాలు అయింది. టిడిపి అభ్యర్థిని మంగ గెలుపుకు  రాష్ట్రంలో టీడీపీ అధికార పార్టీగా ఉండటమే కారణమా? గ్రామస్తులు అందరికీ  తలలో నాలుకల ఉన్నందున భారీ మెజార్టీ సాధ్యమైంది  అన్న చర్చ ఇప్పుడు గ్రామంలో జోరుగా సాగుతోంది
. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నందున , అదే పార్టీ సర్పంచ్ ఉంటే గ్రామానికి నిధులు, రోడ్లు, తాగునీరు, పథకాలు త్వరగా వస్తాయని ఓటర్లు నిర్ణయానికి వచ్చి ఉంటారని ప్రత్యర్ధులు  భావిస్తున్నారు.ఓటర్లు స్పష్టమైన తీర్పుతో  గెలిచిన సర్పంచ్ పై గ్రామస్తుల ఆశలు పెరిగాయి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారా? గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారా? అని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు