అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి..
- వంకాయ గుర్తుపై ఓటు వేసి ప్రత్యూషను గెలిపించండి.
: రావాడ గణపతిరావు
నరసన్నపేట నవంబర్ 29 మేజర్ న్యూస్: పట్టణ ప్రజల అభివృద్ధి ఆకాంక్షలు నెరవేరాలంటే నరసన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జామి ప్రత్యూషకు సీరియల్ నంబర్ 5, వంకాయ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు రావాడ గణపతిరావు ప్రజలను కోరారు. అలాగే కూటమి బలపరిచిన వార్డు అభ్యర్థులందరికీ మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో నరసన్నపేట పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులను పెద్ద ఎత్తున తీసుకొచ్చి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నాణ్యతతో కూడిన పాలన అందించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పట్టణ భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని రావాడ గణపతిరావు తెలిపారు.