అభివృద్ధి- సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన
అభివృద్ధి- సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన
సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశాం
నోటిఫికేషన్ విడుదలకు ముందే ప్రచారం ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే కూటమి నాయకులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈమేరకు శనివారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత 5వ కొత్త11వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని స్థానికంగా వారికున్న సమస్యలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. అనంతరం వార్డులో అవసరమైన చోట సైడ్ డ్రైన్ లు, రోడ్లకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వార్డు కౌన్సిలర్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ నిధులను మంజూరు చేసిందని, ఈ వార్డు అభివృద్ధికి సంబంధించి తమ ప్రభుత్వం నలభై లక్షల రూపాయలు మంజూరు చేస్తే స్థానిక కౌన్సిలర్ కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టి మిగిలిన అభివృద్ధి పనులను అసంపూర్తిగా వది లేయడం సరైన పద్ధతి కాదన్నారు. గత ప్రభుత్వంలో మధ్యలో ఆపేసిన పనులను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్కొక్కటిగా పూర్తి చేయడం జరిగిందన్నారు. గత ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం మున్సిపల్ భవనాన్ని పూర్తి చేయకుండా బేస్ మెంట్ స్థాయిలోనే వదిలివేయడం జరిగిందన్నారు. అనంతరం నాలుగు కోట్ల రూపాయలతో మున్సిపల్ భవనాన్ని పూర్తిచేసి ప్రజలకు అంకితం చేసామన్నారు. దానికి సంబంధించిన నిధుల వినియోగంపై కూడా ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చి కల్లబొల్లి హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత మొఖంచాటే సే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తుందన్నారు. పట్టణంలో అభివృద్ధి జరగాలంటే ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణ అభివృద్ధికి తమ ప్రభుత్వం అంతకుముందే 65 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఇప్పుడు 22 కోట్లు మంజూరు అయిందని, త్వరలో మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరో 25 కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందులో ఐదవ వార్డు అభివృద్ధి పనులకు గాను 70 లక్షల రూపాయలు మంజూరు చేసామని, టెండర్లు కూడా పూర్తయిని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా నీటి సరఫరా, ఆర్డీఎస్ పథకం ద్వారా పవర్ సప్లై వీటన్నిటిని పూర్తి చేసి బుచ్చిరెడ్డిపాలెం పట్టణ అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించి రాబోయే ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి, వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, మండల టిడిపి నాయకులు యర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి, టంగుటూరు మల్లికార్జున రెడ్డి, స్థానిక టిడిపి నాయకులు మోర్ల మురళి, వింజం రామానాయుడు, మునిసిపల్ కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.