BREAKING
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత సుసరాం సర్పంచ్ ను అభినందించిన కృష్ణ చైతన్య... ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదు సైకిల్ గుర్తుకి ఓటు వేయండి శ్రీకాకుళం స్వర్ణయుగానికి నాంది పలికిన రెండున్నరేళ్ల కూటమి పాలన రసమే సాహిత్యానికి ప్రాణం.. మహిళా వర్సిటీ తెలుగు సాహితీ సమితిలో ఆచార్య పి.హరనాథ్ ఎన్నికలవేళ నిబంధనలు తప్పనిసరి నిర్ణీత సమయానికే కౌంటింగ్ పూర్తి చేయాలి ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి ఎన్నికలకు 48 గంటల ముందుగానే ర్యాలీలు, ప్రచారాలు ముగింపు ఘనంగా ద్వాదశ జ్యోతిర్లింగ వైభవ కార్యక్రమం అవినీతి, అక్రమాలకు చరమగీతం పాడాలంటే వైఎస్సార్‌సీపీని గెలిపించాలి.. చలో ఢిల్లీని జయప్రదం చేయండి - పలాసలో సీఐటీయూ పోస్టర్ ఆవిష్కరణ. పన్ను సమస్యల పరిష్కారానికి ‘రెవెన్యూ మేళా’

అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించండి

Select Suryaa Now
అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించండి


-సైకిల్ గుర్తుకు మన ఓటు 
-టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల ఎన్నికల ప్రచారం
ఆమదాలవలస, నవంబర్ 24, మేజర్ న్యూస్ 
ఆమదాలవలస మున్సిపాలిటీ 26,27,28 వార్డుల్లో కూటమి బలపరిచిన టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ అందించాలని ఓటర్లను కోరారు. కూటమి ప్రభుత్వ హయాంలో పట్టణ, వార్డులు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ, వార్డుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. సిసి రోడ్లు, మురుగు కాలవలు, తాగునీటి సౌకర్యాలు ప్రభుత్వ హయాంలో నిర్మించి ప్రజలకు అభివృద్ధిని అందించామని తెలిపారు. వార్డులో ఎలాంటి సమస్య ఉన్న తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వివిధ వార్డుల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో  బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మి, టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి గురుగుబెల్లి నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.