ఆత్మకూరు మున్సిపల్ పోరుకు ఆనం ‘త్రిశూల వ్యూహం’
ఆత్మకూరు మున్సిపల్ పోరుకు ఆనం ‘త్రిశూల వ్యూహం’
టీడీపీ–జనసేన–బీజేపీ నేతలతో త్రిసభ్య కమిటీ.. సమన్వయంతో ముందస్తు కార్యాచరణ
నెల్లూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూటమి పార్టీల మధ్య సమన్వయంపై దృష్టి సారించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి, మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సిద్ధమయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
కూటమిలోని మూడు పార్టీల బలాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, వార్డుల వారీగా పరిస్థితులను సమీక్షిస్తూ ముందుకు సాగేందుకు ‘త్రిశూల వ్యూహం’తో మంత్రి ఆనం అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఆత్మకూరులో ఎన్డీఏ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.