BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

ఆత్మకూరు అభివృద్ధికి రూ.107 కోట్లతో పనులు...మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Select Suryaa Now
ఆత్మకూరు అభివృద్ధికి రూ.107 కోట్లతో  పనులు...మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఆత్మకూరు,మేజర్ న్యూస్ :ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. 2024లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే రూ.107 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, వీటిలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల పనులు దాదాపు పూర్తికావచ్చాయని వివరించారు.

ఆదివారం రాత్రి ఆత్మకూరు ఆర్ అండ్ బి అతిథిగృహంలో మంత్రి ఆనం పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రూ.50,000 కోట్ల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) రహదారి ప్రాజెక్టులో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీకి మరో రూ.29 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న 167 అభివృద్ధి పనులకు సంబంధించి అక్టోబర్ 12వ తేదీన మూడు విడతల్లో భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు పేరారెడ్డిపల్లి ప్రాంతంలో 25, 26, 27వ వార్డుల్లో, ఉదయం 11 గంటలకు నలంద స్కూల్ ప్రాంతంలో 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 24వ వార్డుల్లో, సాయంత్రం 4 గంటలకు టెక్కే వీధి ప్రాంతంలో 10, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23వ వార్డుల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

అక్టోబర్ 13వ తేదీ ఉదయం 11 గంటలకు అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి రవితేజ కల్యాణ మండపం వరకు 2.2 కిలోమీటర్ల మేర నిర్మించనున్న నాలుగు లేన్ల రహదారి పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా భూమిపూజ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సుమారు రూ.8.91 కోట్లతో చేపడుతున్న ఈ రహదారికి సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు.

ఆత్మకూరు తాగునీటి సమస్య పరిష్కారానికి సోమశిల నుంచి నీటిని సరఫరా చేసే కొత్త పైప్‌లైన్ల నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. పట్టణంలో సుమారు రూ.2 కోట్లతో నగరవనం ఏర్పాటు చేయనున్నామని, పడమర వైపు నుంచి జాతీయ రహదారిని సోమశిల మార్గంతో అనుసంధానించేలా కొత్త బైపాస్ రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత రెండేళ్లలో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.100 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని, రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.