ఆత్మకూరు అభివృద్ధి పనులకు శ్రీకారం
ఆత్మకూరుఅభివృద్ధి పనులకు శ్రీకారం
--నేడు, రేపు ఆత్మకూరు పట్టణంలో అభివృద్ధి పనులకు భూమి పూజలు
--మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో పట్టణాభివృద్ధికి
హెచ్ ఏ ఎం పథకం ద్వారా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
--రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో పర్యటించనున్న మంత్రి ఆనం
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమ వెంకటసుబ్బయ్య ::
ఆత్మకూరు పట్టణం మరో అభివృద్ధి పర్వానికి సిద్ధమైంది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.పట్టణంలోని అన్ని వార్డులను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో హైబ్రిడ్ అన్నుటీ మోడల్ విధానంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు అక్టోబర్ 12 మరియు 13 తేదీల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు స్వయంగా భూమి పూజలు నిర్వహించనున్నారు.
పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
అక్టోబర్ 12న మూడు ప్రాంతాల వేదికగా భూమి పూజలు నిర్వహించనున్నారు.
సోమవారం ఉదయం 9 గంటలకు: పేరా రెడ్డి పల్లె ప్రాంతంలో 25, 26, 27 వార్డులకు సంబంధించిన అభివృద్ధి పనులకు భూమి పూజలు నిర్వహిస్తారు.
ఉదయం 11 గంటలకు: నలంద స్కూల్ ఏరియాలో 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 24 వార్డులకు సంబంధించిన అభివృద్ధి పనులకు భూమి పూజలు నిర్వహిస్తారు.సాయంత్రం 4 గంటలకు: టెక్కే వీధిలో 10, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 వార్డులకు సంబంధించిన అభివృద్ధి పనులకు భూమి పూజలు నిర్వహిస్తారు.
13న అభివృద్ధి పనులకు కొనసాగింపుగా భూమి పూజలు
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వెంకట్రావుపల్లి ప్రాంతంలో 1, 2, 28 వార్డులకు సంబంధించిన అభివృద్ధి పనులకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు భూమి పూజలు నిర్వహించనున్నారు.
ఆత్మకూరు సమగ్రాభివృద్ధే మంత్రి ఆనం లక్ష్యంగా
ఆత్మకూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇప్పటికే పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన మంత్రి ఆనం, తాజాగా హెచ్ ఏ ఎం విధానంలో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ద్వారా ఆత్మకూరు పట్టణాభివృద్ధికి మరింత ఊతమివ్వనున్నారు.
అభివృద్ధికి చిరునామాగా ఆత్మకూరును తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి ఆనం ముందుకు సాగుతున్నారు.
ఈ రెండు రోజుల కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూటమి నాయకులు విజ్ఞప్తి చేశారు.