BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

ఆమదాలవలసలో ఉచిత హోమియో వైద్య శిబిరం

Select Suryaa Now
ఆమదాలవలసలో ఉచిత హోమియో వైద్య శిబిరం


-జనహిత సేవా సంఘం ఆధ్వర్యంలో 40 మందికి ఉచిత వైద్య సేవలు
ఆమదాలవలస,
జనహిత సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం నిర్వహించారు. 
ఇండియన్ హోమియోపతి మెడికల్ అసోసియేషన్ కి చెందిన డాక్టర్ కె.వివేకానంద, డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు  40 మంది రోగులకు ఉచిత వైద్య సలహాలు, మందులు అందజేశారు. జలుబు, దగ్గు, జ్వరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, మధుమేహం, రక్తపోటు, ఆస్తమా, అలర్జీలు, పిల్లల ఆరోగ్య సమస్యలు, మూత్రకల సమస్యలు వంటి అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నామని,  ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జనహిత సేవా సంఘం సభ్యులు పేర్కొన్నారు.