BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి..

Select Suryaa Now
17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి..


- ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా.. పొట్నూరు పృథ్వి రాజ్ .

నరసన్నపేట నవంబర్ 29 మేజర్ న్యూస్ : నరసన్నపేట మేజర్ పంచాయతీ 17వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొట్నూరు పృథ్వి రాజ్  ఆదివారం గాంధీనగర్ ప్రాంతంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అభ్యర్థిగా తనకు ఒక అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వార్డు సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అవినీతికి తావులేని పాలన అందించడంతో పాటు ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తానని తెలిపారు. వార్డులోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అవసరాలు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామపంచాయతీ ద్వారా అందే సేవలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

ముఖ్యంగా తాగునీటి సరఫరా, వీధి రహదారుల నిర్వహణ, ప్రతిరోజూ పారిశుధ్య కార్యక్రమాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధికి తనకు మద్దతుగా నిలిచి, స్టూలు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గాంధీనగర్ ప్రజలను పొట్నూరు పృథ్వి రాజ్ విజ్ఞప్తి చేశారు.