12 న రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటు ఎంపిక పోటీలు
12 న రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటు ఎంపిక పోటీలు
ఈ నెల 12 వ తేదీన గార్గేయపురం సిటీ ఫారెస్ట్ చెరువు వద్ద రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటు జట్ల ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర డ్రాగన్ బోట్ సంఘం కార్యదర్శి మంచికంటి అవినాష్ శెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎంపిక పోటీలు సీనియర్ స్త్రీ,పురుషుల విభాగం, అండర్ -23 బల బలికల విభాగం విభాగం,పారా విభాగంలో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.ఎంపికైన క్రీడాకారులు డ్రాగన్ బోట్ ఇండియా అండ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 20 వరకు ఢిల్లీ లో జరగబోయే 13 వ జాతీయ స్థాయి డ్రాగన్ బోట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రతినిత్యం వహిస్తారని తెలిపారు.ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు రూ.100 ప్రవేశ రుస్తుము తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తో నేరుగా హాజరు కావచ్చు అన్నారు.ఈ ఎంపిక పోటీలను ఈ నెల 12 వ తేదీ ఉదయం 7 గంటలకే మొదలవుతాయి అన్నారు.మరిన్ని వివరాలకు 8143084479 నంబర్ కు సంప్రదించవచ్చు అన్నారు.