BREAKING
యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి!

11వ తేదీ నుండి శ్రీ హరిహర క్షేత్రం లో శ్రీ దేవి నవరాత్రి మహోత్సవాలు

Select Suryaa Now
11వ తేదీ నుండి శ్రీ హరిహర క్షేత్రం లో శ్రీ దేవి నవరాత్రి  మహోత్సవాలు

*నిత్య అలంకారలతో భక్తులను అలరించనున్న అమ్మవారు.

*మాజీ మంత్రి శిద్దా రాఘవ రావు దంపతుల ఆధ్వర్యంలో  క్షేత్రంలో విశేష పూజలు.

ఈనెల 11వ తేదీ ఆదివారం నుండి అక్టోబర్ 20 వ తేదీ వరకు చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో జరగనున్న శ్రీ దేవి దసరా నవ రాత్రుల ఉత్సవాలు ప్రారంభం అవుతాయని  మాజీమంత్రి శిద్దా రాఘవరావు, లక్ష్మి పద్మావతి దంపతులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మ కర్తలు శిద్దా రాఘవ రావు మాట్లాడుతూ ప్రతి ఏటా అనవాయితీ వైభవంగా  శిద్దా వెంకట సుబ్బమ్మ,వెంకటేశ్వర్లు ట్రస్ట్  ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ దేవి  దసరా శరన్నవ రాత్రులు  వేడుకలు చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో ఆదివారం నుండి ప్రారంభం అవుతాయని మాజీ మంత్రి శిద్దా తెలిపారు. ఆదివారం సాయంత్రం 6.30  నిముషాలకు బాల త్రిపుర సుందరి దేవి అలంకారం అంకురార్పణ తో శ్రీ హరి హర క్షేత్రంలో మహోత్సవాలు ప్రారంభం అవుతాయని ప్రతి రోజు అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శన భాగ్యంతో పాటు అమ్మవారికి విశేష పూజలు ప్రతి రోజు శ్రీ వాసవి అమ్మవారికి పంచామృత అభిషేకం,శ్రీ చక్ర నవార్చన, తీర్థ ప్రసాదాలు,శ్రీమతి శిద్దా లక్ష్మి పద్మావతి ఆధ్వర్యంలో ఉభయ దాతల పూజలు,ఆర్యవైశ్య మహిళా భక్తులచే సామూహిక శ్రీ లలిత సహస్ర నామ పారాయణం,కుంకుమ పూజలు నిత్యం అన్న ప్రసాద వినియోగం ఉంటుందని శిద్దా రాఘవ రావు తెలిపారు.


*అమ్మవారి అలంకరణ వివరాలు
తొలి రోజు ఆదివారం అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం తో పాటుగా బాల పూజ నవ దుర్గ పూజ, 12 వ తేది సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి తల్లి గా దర్శనంతో పాటు గాజుల అలంకరణ, 13 వ తేది మంగళవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణతో పాటు అమ్మవారు ధాన్యాభిషేకం, 14 వ తేది అమ్మవారు శ్రీ కంచి కామాక్షి దేవి అలంకరణతో పాటుగా సాయంత్రం వాసవి మహిళలచే మణిద్వీప వర్ణన సౌందర్య లహరి పారాయణం,తేది 15 గురువారం అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ,తదుపరి అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ,16 వ తేది శుక్రవారం అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకరణ సాయంత్రం సరస్వతి పూజ,శాస్త్రీయ నృత్య ప్రదర్శన,17 వ తేది శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి తల్లి గా భక్తులకు దర్శన భాగ్యం సాయంత్రం శ్రీ అష్ట లక్ష్మి పూజల కనకాభిషేకం,ఆదివారం 18వతేదీ  అమ్మవారు శ్రీ దుర్గ దేవి అలంకారం సాయంత్రం వన దుర్గ దేవి అలంకరణ షోడాశ హరతులు,19 వ తేది సోమవారం అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దని అలంకారం సాయంత్రం సువాసినులకు పసుపు కుంకుమ పంపిణి,20 వ తేది మంగళవారం అమ్మవారు శ్రీ రాజ రాజేశ్వరి దేవి అలంకారం సాయంత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారుగా అలంకరణ తో పాటుగా చెరుకు గడలతో అమ్మవారి దర్శన భాగ్యం ఉంటుందని  తెలిపారు.అదే రోజు రాత్రికి క్షేత్రంలో ని సాంగ సపరివార దేవతలకు శమీ పూజలు,శమీ దర్శనం,పార్వేట మహోత్సవం,పాల పిట్ట దర్శనం ఆలయ ధర్మ కర్తలు ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు.కావునా భక్తులు అందరు ఈ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటు న్నట్లు  తెలిపారు. శిద్దా వెంకటేశ్వర్లు శ్రీమతి శిద్దా వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు,వాహన సౌకర్యం ధర్మ కర్తలు   ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ హరిహర క్షేత్రంలో జరిగే శ్రీ దేవి శరన్నవ రాత్రి  మహోత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందగలరని కోరుతున్నట్లు మాజీ శిద్దా రాఘవ రావు తెలిపారు.