|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 03:34 PM
గత కొద్ది రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్రాము రూ.10 వేల వరకు కూడా వెళ్లింది. దీంతో చాలా మంది బంగారం కొనుక్కుందామనుకున్నా వెనక్కి అడుగు వేశారు.అయితే ఇవాళ (మే 13) దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీని బట్టి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సహా ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650గా ఉంది.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95, 620గా ఉంది.కేజీ వెండి రూ.1,09,000 ధరగా కొనసాగుతోంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650గా ఉంది.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95, 620గా ఉంది.కేజీ వెండి రూ.1,09,000 ధరగా కొనసాగుతోంది.