విహార యాత్రల వల్ల విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కలుగుతుంది
సూర్య- బిక్కనూర్ : విహార యాత్రల వల్ల విద్యార్థులకు పరిసరాలపై అవగాహనతో పాటు, లోకజ్ఞానం కలుగుతుందని మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయ కరస్పాండెంట్ బండి సుధాకర్ చెప్పారు. ఆదివారం సిద్ధార్థ పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులను ప్రత్యేక వాహనాలలో విహార యాత్రకు తీసుకెళ్లారు. మొదటగా సిద్దిపేట జిల్లా నాచారం లక్ష్మీనరసింహాస్వామి, వర్గల్ సరస్వతి దేవాలయాలతో పాటు ఆలియబాద్ రత్నాలయం దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధార్థ పాఠశాలలో విద్యార్థులకు చదువుతోపాటు, క్రీడలు, సాంప్రదాయ పండుగలు, జాతీయ పండుగలు, విహారయాత్రలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లింగాల శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యాయులు ముందాం బాబు, క్రీడా ఉపాధ్యాయుడు బీరయ్య, శైలజ, స్వర్ణలత,దివ్య శ్రీవాణి,సుప్రియ,భువనేశ్వరి, కీర్తన, నిఖిత విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.