BREAKING
దీక్షా దివస్ సందర్భంగా ఉద్యమకారులకు ఘన సన్మానం.. ..తెలంగాణ ఉద్యమకారుల సేవలను గుర్తు చేసుకున్న ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ..పిట్టలగూడెం గ్రామానికి చెందిన చింతరెడ్డి రవీందర్ రెడ్డికి ప్రత్యేక సత్కారం గిరిజన సంఘం సాంస్కృతి కార్యక్రమాలు 37వ డివిజన్‌లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పంటల బీమాకు దరఖాస్తు చేసుకోండి: వ్యవసాయ అధికారి నార్పలలో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు.. వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం అయ్యప్ప మాల ధరించిన తిప్పాపూర్ గ్రామ భక్తులు విహార యాత్రల వల్ల విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కలుగుతుంది కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంత వెంకట్రామిరెడ్డి. ఐదవ సారి సర్పంచ్ బరిలో విచారపు పావని సిద్ధుగాడి లవ్ స్టోరీకి ఊహించని ఆదరణ.. సక్సెస్ మీట్‌లో చిత్ర బృందం ఆనందం 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ గ్రాండ్ రీఎంట్రీ.. అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్ర! ప్రశాంతంగా ముగిసిన రెండో దశ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక

కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*

Select Suryaa Now
కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*

కర్నూలు, నవంబర్ 29: జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్  ద్వారా పర్యవేక్షించారు.ఆదివారం జిల్లావ్యాప్తంగా రెండవ విడత పోలింగ్ జరుగుతున్న గ్రామపంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తీరును కలెక్టరేట్  నుండి వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళి, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్..ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, పోలింగ్ నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు  అనురాధ, రామ సుబ్బయ్య, ఎన్నికల నోడల్ అధికారి డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.