పంటల బీమాకు దరఖాస్తు చేసుకోండి: వ్యవసాయ అధికారి
వెల్దుర్తి, మేజర్ న్యూస్: రబీ సీజన్‌లో వివిధ పంటలు సాగు చేసిన రైతులు గడువులోగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ప్రీమియం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో కోరారు. అతివృష్టి, అనావృష్టి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టం వాటిల్లినప్పుడు ఈ బీమా రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని తెలిపారు.శనగ, జొన్న, వేరుశనగ, ఉల్లి పంటలకు డిసెంబరు 15 లోపు, వరి పంటకు డిసెంబరు 31 లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎకరానికి చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఉల్లి: రూ. 1,350
వరి: రూ. 630
వేరుశనగ: రూ. 480
శనగ: రూ. 420
జొన్న: రూ. 297
ఆసక్తి గల రైతులు గ్రామంలోని రైతు సేవా కేంద్రం (RSK), కామన్ సర్వీస్ సెంటర్ (CSC), పోస్టాఫీసు లేదా సమీప బ్యాంకులను సంప్రదించి బీమా చేసుకోవాలని ఆయన సూచించారు.