BREAKING
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతినే మార్చింది మాజీమంత్రి హరీశ్‌రావు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వ్యాఖ్య సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు హరీశ్‌రావు వ పంచాయతీల పరిపుష్టికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత : బసినికొండ టిడిపి సర్పంచ్ అభ్యర్థిని సి.అనిత వెల్లడి : మంచం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని వినతి గుమ్మపాడు టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సింహాద్రమ్మకు మద్దతుగా విస్తృత ప్రచారం.. తట్టివారిపల్లి సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తా : వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిని రేపన గంగాదేవి వెల్లడి :కత్తెర గుర్తుపై ఓటువేసి ఆశీర్వదించాలని మనవి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభకి సలాం : సహస్ర ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రామిరెడ్డి అభినందనలు : కోచ్ మురళి శిక్షణకి ప్రత్యేక ప్రశంసలు ప్రధాని మోదీ 'మన్ కి బాత్' ప్రతి బూత్ స్థాయిలో విస్తృతంగా జరగాలి ఫూలే విగ్రహం ఏర్పాటు చేయడంలో ఎందుకీ నిర్లక్ష్యం.. నగర ప్రజాప్రతినిధులారా.. కళ్లుతెరవండి నాటకాలు వద్దు డాక్టర్ పోతుల నాగరాజు.. ఎల్ కోట జామి వీధి లో భారీ శబ్దం తో పేలిన కుక్కర్ వంటగది చిందరవందర.. తృటిలో తప్పిన ప్రమాదం వేధింపులతో మహిళ ఆత్మహత్య ఓటెత్తారు...... రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.... 85.78 శాతం భారీ పోలింగ్ నమోదు ఆస్కార్ నామినేషన్‌పై 'ఆంగ్' దర్శకుడు తేజా రియో ఆశాభావం.. ఈశాన్య సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు మిస్సెస్ హైదరాబాద్ కిరీటం కైవాసం చేసుకున్న పి. గన్నవరం యువతి. బాక్సాఫీస్ వద్ద రామాయణం సరికొత్త చరిత్ర.. ధురంధర్ 2 రికార్డు బద్దలు కొట్టి రెండో స్థానానికి దూసుకెళ్లిన ఇతిహాస చిత్రం కార్తీక మహా దీపోత్సవానికి టీటీడీ సర్వం సిద్ధం

బాడంగి కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటుకు స్థానికుల ఆకాంక్ష

Select Suryaa Now
బాడంగి కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటుకు స్థానికుల ఆకాంక్ష

బాడంగి,(మేజర్ న్యూస్): నియోజకవర్గాల పునర్విభజన చర్చ నేపథ్యంలో బాడంగి కేంద్రంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలన్న ఆకాంక్ష బాడంగి మండలంలో వ్యక్తమవుతోంది. గతంలో తెర్లాం నియోజకవర్గంలో ఉన్న బాడంగి, తెర్లాం, మెరకముడిదాం మండలాలను కలుపుతూ బాడంగి కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతానికి అభివృద్ధిపరంగా మేలు జరుగుతుందని బాడంగి మండలానికి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు.
మూడు మండలాల మధ్యలో బాడంగి
బాడంగి మండల కేంద్రం మూడు మండలాలకు మధ్యలో ఉండటం, జాతీయ రహదారి మండల కేంద్రం మీదుగా వెళ్లడం ఈ ప్రాంతానికి ప్రధాన అనుకూలతలుగా పేర్కొంటున్నారు. మూడు మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం, ప్రభుత్వ కార్యాలయాలకు చేరుకునే వెసులుబాటు పరంగా బాడంగి అనువైన కేంద్రంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇప్పటికే మండల కేంద్రంలో దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్టేట్ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ ఉండటంతో పాటు, సమీపంలో అగ్నిమాపక కేంద్రం, రైల్వే స్టేషన్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. బాడంగికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో వేగావతి నది, కూత వేటు దూరంలో పాత విమానాశ్రయ రన్‌వే ఉండటం కూడా అభివృద్ధి అవకాశాల దృష్ట్యా ప్రాధాన్యం సంతరించుకుంది.
అభివృద్ధికి అనుకూల కేంద్రం
బాడంగి, తెర్లాం, మెరకముడిదాం మండలాలను కలుపుతూ కొత్త నియోజకవర్గం ఏర్పడితే మూడు మండలాలకు మెరుగైన పరిపాలనా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రహదారులు, రవాణా, వాణిజ్య కార్యకలాపాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని బాడంగి మండల ప్రజలు పేర్కొంటున్నారు.
అయితే, బాడంగి కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రానున్న డీలిమిటేషన్ ప్రక్రియలో బాడంగి మండలానికి ప్రాధాన్యం కల్పించి, గతంలో ఒకే నియోజకవర్గ పరిధిలో ఉన్న మూడు మండలాలను కలుపుతూ బాడంగి కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.