BREAKING
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి *జహీరాబాద్‌లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం* రాయ‌పాటి సాంబ‌శివ‌రావు మృత‌కి సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ యేసురత్నం *ప్రశాంత్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన మున్సిపల్ కౌన్సిలర్ సంపత్ కుమార్* వైభవంగా శ్రీ రామకృష్ణ వివేకానంద 26వ వార్షికోత్సవం. కేసీఆర్ దీక్ష.. తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం! 2029లో అధికారం కోసం కొత్త సమీకరణాలు! ,పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఆకాంక్షకు చంద్రబాబు అంగీకరిస్తారా? శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం పింప్పడ్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం దీక్షా దివస్‌లో గర్వంగా పాల్గొన్న బోయినపల్లి మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ *దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు*

పంచాయతీల పరిపుష్టికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత : బసినికొండ టిడిపి సర్పంచ్ అభ్యర్థిని సి.అనిత వెల్లడి : మంచం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని వినతి

Select Suryaa Now
పంచాయతీల పరిపుష్టికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత : బసినికొండ టిడిపి సర్పంచ్ అభ్యర్థిని సి.అనిత వెల్లడి : మంచం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని వినతి

మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : కూటమి పాలనతోనే పంచాయతీల అభివృద్ధి సాధ్యపడుతుందని కూటమి బలపరిచిన బసినికొండ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిని చుక్కా అనిత పేర్కొన్నారు.ఆదివారం తన భర్త,టిడిపి సీనియర్ నాయకులు చుక్కా విజయ్ కుమార్,కూటమి శ్రేణులతో కలిసి పంచాయతీ పరిధిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సి.అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంక్షేమ పాలన అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు.సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.అనంతరం టిడిపి సీనియర్ నాయకులు బాలుస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నారని ప్రశంసించారు.ఇకపోతే బసినికొండ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి సి.అనిత విజయ్ కుమార్ అని,ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు పంచాయతీ అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని,డిసెంబర్ 2వ తేదీన జరిగే ఎన్నికల్లో మంచం గుర్తుపై ఓటు వేసి ఆఖండ మెజారిటీతో గెలిచించాలన్నారు.ఇప్పటికే ముగ్గురు వార్డు మెంబర్లు ఏకగ్రీవం కావడం శుభసూచకమని,ఇదే స్పూర్తితో సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెరవలి రెడ్డి,రేణుకమ్మ,ఎన్.గాయత్రి,ఎన్.శాంతమ్మ,అనసూయమ్మ,వాజీద్,సుబ్బారెడ్డి పద్మనాభం,కూటమి శ్రేణులు,పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి