దీక్షా దివస్‌లో గర్వంగా పాల్గొన్న బోయినపల్లి మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య
సూర్య బోయినపల్లి..తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా నేడు కరీంనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బోయినపల్లి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య గర్వంగా పాల్గొన్నారు.కార్యక్రమ వేదిక వద్ద కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాల ముందు ఆయన గర్వంగా నిలబడి ఫోటో దిగారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన నాయకుల చిత్రపటాల వద్ద నిలబడటం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన దీక్షే మనకు స్వరాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. ఆ చారిత్రాత్మక రోజును గుర్తు చేసుకుంటూ కరీంనగర్‌లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం" అని కొండయ్య పేర్కొన్నారు.తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం కేసీఆర్, కేటీఆర్ చూపుతున్న నాయకత్వమే నేటి తరానికి ఆదర్శమని, ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. బోయినపల్లి మండలం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.