*దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు*
నారాయణఖేడ్;మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశానుసారం నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారని, ఆయన చేసిన అలుపెరుగని పోరాటం, త్యాగం, పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పి, ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందని కొనియాడారు. తెలంగాణ చరిత్రలో దీక్షా దివస్ ఒక చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని, త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవం, అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ గారు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, విట్టల్ రావు పటేల్, మున్సిపల్ కౌన్సిలర్లు అభిషేక్ షెత్కార్, విజయ్ బుజ్జి, మాజీ కౌన్సిలర్ విట్టల్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గోపాల్, సర్పంచ్ గణపతి, మాజీ సర్పంచులు చన్ బసప్ప, జైపాల్ రెడ్డి, రవి నాయక్, సంతోష్ నాయక్, నాయకులు జైపాల్, సర్దార్ నాయక్, చింటూ, నరేష్, బాబు సింగ్, రాములు, వెంకట్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.