BREAKING
*డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది* పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి *జహీరాబాద్‌లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం* రాయ‌పాటి సాంబ‌శివ‌రావు మృత‌కి సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ యేసురత్నం *ప్రశాంత్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన మున్సిపల్ కౌన్సిలర్ సంపత్ కుమార్* వైభవంగా శ్రీ రామకృష్ణ వివేకానంద 26వ వార్షికోత్సవం. కేసీఆర్ దీక్ష.. తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం! 2029లో అధికారం కోసం కొత్త సమీకరణాలు! ,పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఆకాంక్షకు చంద్రబాబు అంగీకరిస్తారా? శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం పింప్పడ్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం దీక్షా దివస్‌లో గర్వంగా పాల్గొన్న బోయినపల్లి మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్

కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతినే మార్చింది మాజీమంత్రి హరీశ్‌రావు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వ్యాఖ్య సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు హరీశ్‌రావు వ

Select Suryaa Now
కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతినే మార్చింది  మాజీమంత్రి హరీశ్‌రావు  దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్  తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వ్యాఖ్య  సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు హరీశ్‌రావు వ

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్ర గతిని మార్చిందని, యావత్ తెలంగాణ తరతరాల ఆకాంక్షను నెరవేర్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు పేర్కొన్నారు. 'దీక్షా దివస్' సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ రాష్ట్రం" అని హరీశ్‌రావు కొనియాడారు. నాడు 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అన్న నినాదంతో కేసీఆర్ మొక్కవోని దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. ఆ పోరాట పటిమ ఫలితంగానే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
కేసీఆర్‌ తన ఆత్మబలాన్ని ఆయుధంగా, వాక్‌శక్తిని ఇంధనంగా, నిజాయతీ, నిబద్ధతలను కవచకుండలాలుగా చేసుకొని తెలంగాణ పోరాటాన్ని విజయతీరాలకు చేర్చిన యోధుడని హరీశ్‌రావు అభివర్ణించారు. ప్రజల కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసి, తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చారని చెప్పారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఢిల్లీ పాలకుల మెడలు వంచి, అర్ధ శతాబ్దపు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కేసీఆర్ సాకారం చేశారని వివరించారు. దీక్షా దివస్ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, సిద్దిపేటలోని అమరవీరుల స్తూపం వద్ద జరిగే కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని నివాళులర్పించనున్నారు.