BREAKING
కేసీఆర్ దీక్ష.. తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం! 2029లో అధికారం కోసం కొత్త సమీకరణాలు! ,పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఆకాంక్షకు చంద్రబాబు అంగీకరిస్తారా? శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం పింప్పడ్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం దీక్షా దివస్‌లో గర్వంగా పాల్గొన్న బోయినపల్లి మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ *దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు* సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య... వేమవరంలో 40 ఏళ్ల టీడీపీ ఆధిపత్యానికి తెర.. స్వతంత్ర అభ్యర్థి నంబూరి రాజ్యలక్ష్మి ఘన విజయం జలుమూరు మండల పేజ్ 3 పిఓలకు శిక్షణ. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతినే మార్చింది మాజీమంత్రి హరీశ్‌రావు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వ్యాఖ్య సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు హరీశ్‌రావు వ

ప్రధాని మోదీ 'మన్ కి బాత్' ప్రతి బూత్ స్థాయిలో విస్తృతంగా జరగాలి

Select Suryaa Now
ప్రధాని మోదీ 'మన్ కి బాత్' ప్రతి బూత్ స్థాయిలో విస్తృతంగా జరగాలి

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రతిష్టాత్మక 'మన్ కి బాత్' 141వ ఎపిసోడ్‌ను బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాoచందర్ రావు భాగ్యనగర్ జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. అంతకుముందు ఆయన గవర్నర్ గారితో కలిసి 'నషా ముక్త్ భారత్' (డ్రగ్స్ రహిత భారత్) కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఎన్. రాoచందర్ రావు  మీడియాతో మాట్లాడుతూ, 'మన్ కి బాత్' కార్యక్రమం పట్ల ప్రజల్లో మరియు పార్టీ కార్యకర్తల్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. 141 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం సామాన్యమైన విషయం కాదని, ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు ఎన్నో కొత్త విషయాలు, స్ఫూర్తిదాయక అంశాలు తెలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ గారు తన ప్రసంగంలో దేశాభివృద్ధి, యువత పాత్ర మరియు సామాజిక అంశాలపై ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ఈ కార్యక్రమాన్ని ప్రతి బూత్ స్థాయిలో మరింత విస్తృతంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న నారీ శక్తి వందన్ అధినియమ్ (చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు) మరియు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుల గురించి ఆయన ప్రస్తావించారు. దేశ జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో 40 లక్షల జనాభా ఉంటే, సికింద్రాబాద్‌లో 12 లక్షలు మాత్రమే ఉందని, అలాగే మలక్‌పేటలో 5 లక్షలు, యాకుత్‌పురలో 2 లక్షలు, చార్మినార్‌లో 7.5 లక్షలు, అంబర్‌పేటలో 2.5 లక్షల జనాభా ఉందని వివరించారు. ఈ జనాభా వ్యత్యాసాలను సరిదిద్దేందుకే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును, మహిళా సాధికారత కోసం 33 శాతం రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తోందని తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాలకు దేశ ప్రజలు, ముఖ్యంగా మహిళలు సంపూర్ణ మద్దతు తెలపాలని, ఈ బిల్లులు ఆమోదం పొందిన వెంటనే పెద్ద ఎత్తున ప్రధాని నరేంద్ర మోదీ గారికి అభినందనలు తెలియజేయాలని ఆయన కోరారు. అదేవిధంగా, త్వరలో జరగబోయే పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియని రాoచందర్ రావు గుర్తుచేశారు. 2023 అంతకంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటరుగా ఎన్‌రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి తదితరులు అందుబాటులో ఉంటారని, వారి సహకారంతో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున ఓటరు నమోదు జరగాలని ఆకాంక్షించారు.