దీక్షా దివస్ సందర్భంగా ఉద్యమకారులకు ఘన సన్మానం.. ..తెలంగాణ ఉద్యమకారుల సేవలను గుర్తు చేసుకున్న ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ..పిట్టలగూడెం గ్రామానికి చెందిన చింతరెడ్డి రవీందర్ రెడ్డికి ప్రత్యేక సత్కారం
గుర్రంపోడ్ మేజర్ న్యూస్ :దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. గుర్రంపోడ్ మండలంలోని పిట్టలగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతరెడ్డి రవీందర్ రెడ్డితో పాటు పలువురు తెలంగాణ ఉద్యమకారులను ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఉద్యమకారులకు శాలువాలు కప్పి పూలమాలలతో సన్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో వారు చేసిన పోరాటాలు, అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.దీక్షా దివస్ సందర్భంగా ఉద్యమకారులను సన్మానించడం ద్వారా వారి పోరాట స్ఫూర్తిని, త్యాగాలను మరోసారి గుర్తు చేసుకున్నట్లయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతరెడ్డి రవీందర్ రెడ్డితో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నా