.
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
నిర్మల్ పట్టణంలోని ఆర్.కే. కన్వెన్షన్ హాల్లో (1974–1976) సంవత్సరాల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదువుకున్న 93 మంది పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా ఒకే వేదికపై కలుసుకొని 50 ఏళ్ల స్వర్ణోత్సవ సంబరాలు పూర్వ విద్యార్థులు అపూర్వ ఆత్మీయ అపురూప సమ్మేళనాన్ని ఘనంగా ఒక ఇంటి పండగలా అత్యుత్సాహంగా ఉత్సాహభరితంగా నిర్వహించుకున్నారు.
సుమారు ఐదు దశాబ్దాల క్రితం నిర్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించి, అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఐదు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడంతో ఒక అపూర్వ సమ్మేళనం, మిత్రులు అందరూ ఒకేచోట కలుసుకోవడంతో వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, పాత మిత్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఆత్మీయంగా గడిపారు.
ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రోజంతా సందడిగా గడిపారు. నాటి బాల్య చిత్రాలు, నేటి చిత్రాలతో 'నాడు–నేడు' పేరుతో ప్రత్యేక ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ గత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల జీవిత అనుభవాలు, బాల్య స్మృతులతో రూపొందించిన 'స్వర్ణోత్సవం' అనే ప్రత్యేక సంకలనాన్ని ఆవిష్కరించారు.
ఈ సమ్మేళనంలో డా. అప్పాల చక్రధారి, కృష్ణమోహన్ దేశ్‌పాండే, డా. జీవన్ రావు, బి. వనజ, లావణ్య మోసెస్, రామాగౌడ్, సంజీవరెడ్డి, ఎల్ ఐ సి రాములు ఎల్ ఐ సి నే ఇంటిపేరుగా పిలువవడే విధంగా పేరు గడించిన వ్యక్తితో పాటుగా మొత్తం 93 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఐదు దశాబ్దాల కాలం గడిచినా చెదరని స్నేహబంధాలు, మధురమైన బాల్య జ్ఞాపకాలు ఈ స్వర్ణోత్సవ సమ్మేళనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చదువుకున్న విద్యాసంస్థతో ఉన్న అనుబంధాన్ని, ఆనాటి స్నేహాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ఈ వేడుకను మధుర జ్ఞాపకంగా మలుచుకున్నారు.