BREAKING
గిరిజన సంఘం సాంస్కృతి కార్యక్రమాలు 37వ డివిజన్‌లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పంటల బీమాకు దరఖాస్తు చేసుకోండి: వ్యవసాయ అధికారి నార్పలలో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు.. వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం అయ్యప్ప మాల ధరించిన తిప్పాపూర్ గ్రామ భక్తులు విహార యాత్రల వల్ల విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కలుగుతుంది కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంత వెంకట్రామిరెడ్డి. ఐదవ సారి సర్పంచ్ బరిలో విచారపు పావని సిద్ధుగాడి లవ్ స్టోరీకి ఊహించని ఆదరణ.. సక్సెస్ మీట్‌లో చిత్ర బృందం ఆనందం 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ గ్రాండ్ రీఎంట్రీ.. అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్ర! ప్రశాంతంగా ముగిసిన రెండో దశ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక నర్సంపేటలో బిఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు పై గులాబీ శ్రేణుల మండిపాటు

వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం

Select Suryaa Now
వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం

ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో నగర శివారులో నిర్మించిన శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం వైభవంగా జరిగింది. గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న  పూజలతో పాటు ఆదివారం యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్ట, ప్రతిష్టాంగ హోమం, కళాన్యాసం, కక్ష జ్వాల, బలిహరణం, దేను దర్శనం, పూర్ణాహుతి, మహా మంగళ హారతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పురోహితులు విరివింటి కృష్ణమూర్తి శర్మ, తోటపల్లి వెంకట గురురాజు బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం గొర్రెలు, మేకల కార్పొరేషన్ చైర్ పర్సన్ సవితా తిరుపతయ్య, కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ విశాలమైన ప్రాంగణంలో భీరలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. సరిత తిరుపతయ్య మాట్లాడుతూ కురువలు అందరూ ఐక్యంగా ఉండి ఇంత భారీ స్థాయిలో ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు.  విగ్రహ ప్రతిష్ట పూజల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కురువ కులస్తులు ఇంకా అభివృద్ధి చెందాలని విద్యారంగంతో పాటు రాజకీయ రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. 
ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.కె.రంగస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు,  అసోసియేట్ అద్యక్షులు గుడిసె శివన్న, ఉపాధ్యక్షులు ధనుంజయ, వెంకటేశ్వర్లు, కత్తి శంకర్, కోశాధికారి కేసీ నాగన్న, పాల సుంకన్న, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీల, నగర అధ్యక్షులు తౌడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బి రామకృష్ణ, నాయకులు వీరన్న, మద్దిలేటి, నందికొట్కూరు జెడ్పిటిసి సభ్యులు కే వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఈశ్వరయ్య, బి. మల్లికార్జున, రమణ,  నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు