BREAKING
గిరిజన సంఘం సాంస్కృతి కార్యక్రమాలు 37వ డివిజన్‌లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పంటల బీమాకు దరఖాస్తు చేసుకోండి: వ్యవసాయ అధికారి నార్పలలో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు.. వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం అయ్యప్ప మాల ధరించిన తిప్పాపూర్ గ్రామ భక్తులు విహార యాత్రల వల్ల విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కలుగుతుంది కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంత వెంకట్రామిరెడ్డి. ఐదవ సారి సర్పంచ్ బరిలో విచారపు పావని సిద్ధుగాడి లవ్ స్టోరీకి ఊహించని ఆదరణ.. సక్సెస్ మీట్‌లో చిత్ర బృందం ఆనందం 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ గ్రాండ్ రీఎంట్రీ.. అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్ర! ప్రశాంతంగా ముగిసిన రెండో దశ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక నర్సంపేటలో బిఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు పై గులాబీ శ్రేణుల మండిపాటు

నర్సంపేటలో బిఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు పై గులాబీ శ్రేణుల మండిపాటు

Select Suryaa Now
నర్సంపేటలో బిఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు పై గులాబీ శ్రేణుల మండిపాటు

నర్సంపేట, మేజర్ న్యూస్, నర్సంపేట పట్టణంలో మున్సిపల్ అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన తోరణాలు, ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది బలవంతంగా తొలగించారు.పట్టణంలోని కాకతీయ కళాతోరణం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, వాటిని కూడా మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు.

*నిబంధనలు బీఆర్ఎస్ కేనా?*

పట్టణంలో కాంగ్రెస్ నాయకుల పుట్టినరోజు ఫ్లెక్సీలు, వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు నెలల తరబడి దర్శనమిస్తున్నా మున్సిపల్ అధికారులకు కనిపించడం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ కార్యక్రమాల విషయంలోనే నిబంధనలు గుర్తుకొస్తున్నాయా అని మండిపడుతున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ఘటనను కూడా ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
మున్సిపల్ అధికారులు రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ తీరుపై కూడా వారు తీవ్ర విమర్శలు గుప్పించారు.దీంతో నర్సంపేటలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

రిపోర్టర్; ప్రవీణ్ కుమార్, నర్సంపేట వరంగల్ జిల్లా,