మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక
*--ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యానికి గరిష్ఠ ధర క్వింటాల్‌కు రూ.3,736.*
నవాబుపేట సూర్య న్యూస్: మండల కేంద్రంలొని వ్యవసాయ మార్కెట్‌కు ఆదివారం వివిధ రకాల ధాన్యం భారీగా తరలివచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి రమేష్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మార్కెట్‌కు వచ్చిన ధాన్యం వివరాలు,ధరలను ఆయన వెల్లడించారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యం 33,064బస్తాలు,13,226క్వింటాళ్లు మార్కెట్‌కు రాగా,క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.3,736,కనిష్ఠ ధర రూ.2,412,మధ్య రకం ధర రూ.3,730పలికింది.అదేవిధంగా 1010 కం ధాన్యం 338 బస్తాలు,135 క్వింటాళ్లు రాగా,గరిష్ఠ ధర రూ.2,289,కనిష్ఠ ధర రూ.2,218, మధ్య రకం ధర రూ.2,289గానమోదైంది.మొక్కజొన్న 8బస్తాలు,4క్వింటాళ్లు రాగా,క్వింటాల్‌కు రూ.2,860ధర పలికింది.రైతులు తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చే ముందు ధరల వివరాలను తెలుసుకోవాలని మార్కెట్ కార్యదర్శి రమేష్ కుమార్ సూచించారు.