andhrapradesh
గిరిజన సంఘం సాంస్కృతి కార్యక్రమాలు
Andhrapradesh
29 Nov 2026
32 views
వేడం ఎస్టీ కాలనీలో గిరిజన సంగీత, నృత్య ఉత్సవాలు.
ఆంధ్ర ప్రదేశ్
ఆదివాసి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ తిరుపతి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సాంస్కృతిక సమితి, భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో నిర్వహించిన రెండు రోజుల గిరిజన సంగీత, నృత్య ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు కార్యక్రమాన్ని ఈరోజు వేదం ఎస్టీ కాలనీలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యానాది, ఇతర గిరిజన కళాకారులు పాల్గొని తమ సంప్రదాయ సంగీతం, జానపద నృత్యాలు, వివిధ గిరిజన కళారూపాలను ప్రదర్శించారు. కళాకారుల ప్రదర్శనలు స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలు, తరతరాలుగా వారసత్వంగా వస్తున్న జానపద సంగీత, నృత్య సంపదను పరిరక్షించి భావితరాలకు అందించడం. గిరిజన సంప్రదాయ కళలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం కల్పించడంతో పాటు కళాకారులలోని ప్రతిభను వెలికితీసి వారికి గౌరవప్రదమైన వేదిక కల్పించడం ఈ ఉత్సవాల ముఖ్య లక్ష్యం.
గిరిజన కళలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, వారి జీవన విధానం, చరిత్ర, సామాజిక ఐక్యత, సాంస్కృతిక గుర్తింపుకు ప్రతిబింబంగా నిలుస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కనుమరుగవుతున్న సంప్రదాయ కళారూపాలను కాపాడి, యువతకు వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ సి. కోటయ్య మాట్లాడుతూ, గిరిజన కళాకారులను ప్రోత్సహించడం, వారి కళలకు సమాజంలో తగిన గుర్తింపు తీసుకురావడం, సంప్రదాయ కళారూపాలను భావితరాలకు అందించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక ఉత్సవాలు గిరిజన కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు గిరిజన సంస్కృతి పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ రెండు రోజుల గిరిజన సంగీత, నృత్య ఉత్సవాలు భైరవ ఎస్టీ కాలనీ, వేదం ఎస్టీ కాలనీలలో విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సాంస్కృతిక సమితి, కళాకారులు, గ్రామ పెద్దలు స్థానిక ప్రజలకు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. VC VENKATAIAH సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి
ట్యాగ్లు:
Latest News