BREAKING
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి *జహీరాబాద్‌లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం* రాయ‌పాటి సాంబ‌శివ‌రావు మృత‌కి సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ యేసురత్నం *ప్రశాంత్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన మున్సిపల్ కౌన్సిలర్ సంపత్ కుమార్* వైభవంగా శ్రీ రామకృష్ణ వివేకానంద 26వ వార్షికోత్సవం. కేసీఆర్ దీక్ష.. తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం! 2029లో అధికారం కోసం కొత్త సమీకరణాలు! ,పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఆకాంక్షకు చంద్రబాబు అంగీకరిస్తారా? శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం పింప్పడ్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం దీక్షా దివస్‌లో గర్వంగా పాల్గొన్న బోయినపల్లి మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ *దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు*

తట్టివారిపల్లి సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తా : వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిని రేపన గంగాదేవి వెల్లడి :కత్తెర గుర్తుపై ఓటువేసి ఆశీర్వదించాలని మనవి

Select Suryaa Now
తట్టివారిపల్లి సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తా : వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిని రేపన గంగాదేవి వెల్లడి :కత్తెర గుర్తుపై ఓటువేసి ఆశీర్వదించాలని మనవి

మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : తట్టివారిపల్లి అభివృద్ధి,ప్రజాసంక్షేమమే తన లక్ష్యమని వైఎస్ఆర్సిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని రేపన గంగాదేవి పేర్కొన్నారు.ఆదివారం తన భర్త,వైఎస్ఆర్సిపి నాయకులు రేపన మనోహర్,పార్టీ శ్రేణులతో కలిసి ఆమె పంచాయతీ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించేవారని,గ్రామాలు సస్యశ్యామలంగా మారాయన్నారు.ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను నేరుగా తిలకించిన మాజీ సీఎం జగనన్న నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు.ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే మళ్లీ జగనన్న పాలన కావాలని,పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.డిసెంబర్ రెండవ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటువేసి తట్టివారిపల్లి అభివృద్ధికి ప్రజలు దోహదపడాలని పిలుపునిచ్చారు.బీసీ సెల్ సెక్రెటరీ నగేష్,ఎంపీటీసీ ఎన్.చలపతి,ఫయాజ్,అంజిబాబు,రఫీ,గుణ,నగేష్,సురేష్,వెంకటరెడ్డి,రమణ మేస్త్రి,రేపన మల్లికార్జున,శ్రీనివాసులు  పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి