BREAKING
కేసీఆర్ దీక్ష.. తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం! 2029లో అధికారం కోసం కొత్త సమీకరణాలు! ,పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఆకాంక్షకు చంద్రబాబు అంగీకరిస్తారా? శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం పింప్పడ్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం దీక్షా దివస్‌లో గర్వంగా పాల్గొన్న బోయినపల్లి మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ *దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు* సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య... వేమవరంలో 40 ఏళ్ల టీడీపీ ఆధిపత్యానికి తెర.. స్వతంత్ర అభ్యర్థి నంబూరి రాజ్యలక్ష్మి ఘన విజయం జలుమూరు మండల పేజ్ 3 పిఓలకు శిక్షణ. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతినే మార్చింది మాజీమంత్రి హరీశ్‌రావు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వ్యాఖ్య సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు హరీశ్‌రావు వ

కార్తీక మహా దీపోత్సవానికి టీటీడీ సర్వం సిద్ధం

Select Suryaa Now
కార్తీక మహా దీపోత్సవానికి టీటీడీ సర్వం సిద్ధం

కార్తీక మహా దీపోత్సవానికి టీటీడీ సర్వం సిద్ధం

*30వ తేదీ రాత్రి దీప కాంతులతో వెలుగొందనున్న పరేడ్ మైదానం

*వందలాది మహిళలతో సామూహిక దీపారాధన – శ్రీ మహాలక్ష్మీ పూజ ప్రత్యేక ఆకర్షణ


పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో సోమవారం రాత్రి "కార్తీక మహా దీపోత్సవం" అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

దీపాల వెలుగులో మహిళా భక్తుల సామూహిక పూజ
-------------
వందలాది మంది మహిళలు ఒకే చోట చేరి సామూహికంగా దీపాలు వెలిగించేలా ప్రత్యేక దీపపు దిమ్మెలు, నేతి వత్తులను సిద్ధం చేశారు. భక్తులు సౌకర్యంగా కూర్చుని పూజలో పాల్గొనేందుకు మైదానమంతా తివాచీలు పరిచారు.

పుష్పాలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా వేదిక
---------
ఈ కార్యక్రమ వేదికను రంగురంగుల పూలతో, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. వేదికకు ఇరువైపులా ఆకట్టుకునే ప్రత్యేక అలంకరణలు చేశారు. ఉత్సవంలో భాగంగా నిర్వహించే శ్రీ మహాలక్ష్మీ పూజకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

పండుగ వాతావరణంలో ప్రాంగణం
------------
టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారాల నుంచి ప్రాంగణం వరకు అరటి చెట్లు, పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించి పండుగ శోభ తీసుకొచ్చారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఆధ్యాత్మిక శోభ
---------
కార్తీక మాస పవిత్రతను చాటుతూ, వేలాది దీపాల వెలుగులతో పరేడ్ మైదానం ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని టీటీడీ కోరుతోంది

Raaju బ్యూరో, తిరుపతి జిల్లా