BREAKING
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి *జహీరాబాద్‌లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం* రాయ‌పాటి సాంబ‌శివ‌రావు మృత‌కి సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ యేసురత్నం *ప్రశాంత్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన మున్సిపల్ కౌన్సిలర్ సంపత్ కుమార్* వైభవంగా శ్రీ రామకృష్ణ వివేకానంద 26వ వార్షికోత్సవం. కేసీఆర్ దీక్ష.. తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం! 2029లో అధికారం కోసం కొత్త సమీకరణాలు! ,పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఆకాంక్షకు చంద్రబాబు అంగీకరిస్తారా? శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం పింప్పడ్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం దీక్షా దివస్‌లో గర్వంగా పాల్గొన్న బోయినపల్లి మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ *దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు*

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్

గుంటూరు : సోమవారం నిర్వహించనున్న మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, పొన్నూరు మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 62 వార్డులకు ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు మొత్తం 127 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, మేయర్ ఎన్నికకు సంబంధించి మరో 127 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అదేవిధంగా, పొన్నూరు మున్సిపాలిటీలోని 40 వార్డులకు ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు 40 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఛైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించి 40 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

 

 

సూర్య నాయక్