37వ డివిజన్‌లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్:)
అనంతపురం నగరంలోని 37వ డివిజన్‌లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా కార్పొరేటర్ బలరాం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. డివిజన్‌లో పారిశుధ్య పనులు సక్రమంగా జరిగేలా దగ్గరుండి పర్యవేక్షిస్తూ, పారిశుధ్య కార్మికులతో పనులు చేయిస్తున్నారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు కాకర్ల శ్రీనివాసరెడ్డి కూడా పారిశుధ్య పనులను పరిశీలిస్తూ డివిజన్‌లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలకు ఎలాంటి పారిశుధ్య ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.డివిజన్‌ను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, నాయకులు చేస్తున్న ఈ ప్రయత్నాలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.