అయ్యప్ప మాల ధరించిన తిప్పాపూర్ గ్రామ భక్తులు
సూర్య- బిక్కనూర్ : మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన 35 మంది భక్తులు ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప మాల ధారణ చేశారు. గ్రామ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు, పిఎసిఎస్ చైర్మన్ తిరుపారి భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాలాధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంట లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దాయారి సాయి రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు