గుమ్మపాడు టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సింహాద్రమ్మకు మద్దతుగా విస్తృత ప్రచారం..
సారవకోట నవంబర్ 29 మేజర్ న్యూస్: గుమ్మపాడు గ్రామ పంచాయతీ టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కత్తిరి సింహాద్రమ్మ విజయాన్ని కాంక్షిస్తూ ఆమె కుమారుడు, సారవకోట మండల టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం గ్రామంలోని ప్రతి వీధి, వార్డులో ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుని మద్దతు కోరారు.
ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ, తన తల్లి సింహాద్రమ్మను సర్పంచ్‌గా గెలిపిస్తే గుమ్మపాడు గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, అర్హులకు సంక్షేమ పథకాలు, విద్యా, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు, మహిళలు, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొంటూ సింహాద్రమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు అభ్యర్థులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు ప్రచారానికి ఘన స్వాగతం పలికారు.