BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు

Select Suryaa Now
ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు

మునిప‌ల్లి;ఉపాద్యాయుల దినోత్స‌వం సంద‌ర్భంగా శ‌నివారం మండ‌లంలోని లింగంప‌ల్లి  పీఎం శ్రీ తెలంగాణ గురుకుల పాఠశాల,  జూనియర్ కళాశాల (బాలుర) బాలల దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా  పాఠ‌శాల‌లో  విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో  తోటి విద్యార్థుల‌కు  పాఠాలు బోధించారు. ఉపాధ్యాయుల స్థానంలో నిలబడి పాఠ్యాంశాలను వివరించడం, విద్యార్థులకు ప్రశ్నలు అడగడం, సమాధానాలు చెప్పించడం వంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల , కళాశాల ప్రిన్సిపాల్‌గా ఎం. రాఘవేంద్ర, వైస్ ప్రిన్సిపాల్‌గా పి. అభిలాష్, గణిత ఉపాధ్యాయులుగా ప్రేమానందం, ఎం. సాల్మన్, కే. ప్రణీత్, డి.కే. కార్తీక్ రెడ్డి, డీఈవోగా పి. మణితేజ, ముఖ్యమంత్రిగా ఎం. శివచరణ్, పీటీ , పీడీలుగా ఎస్. ప్రవీణ్, విశ్వనాథ్ తదితర విద్యార్థులు వివిధ బాధ్యతలను చేపట్టారు.   విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి ప్ర‌తిభ గ‌న‌ప‌ర్చిన విద్యార్థుల‌ను ఉపాధ్యాయులు అభినందించారు.