BREAKING
అయ్యప్ప అన్నసమారాధనలో పాల్గొన్న స్వాతి ప్రమోటర్స్ ఎండి రమేష్ రెడ్డి నేరడిగొండ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం సిద్దిపేట డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి - టీఎంయూ రాష్ట్ర నాయకుల డిమాండ్ ఆళ్లగడ్డ మండలంలో కూటమి ప్రభంజనం ఐవీవై పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు కీర్తి సురేష్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ 'అక్క' వెబ్ సిరీస్: మాతృస్వామ్య నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వచ్చునూరు గ్రామ మాజీ సర్పంచ్ పారమిత విద్యాసంస్థలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు వ్యూహం ఫలించింది...ఆశించిన ఎంపీపీ పీఠం దక్కింది! పాలమూరు ఎడారిగా మారడానికి కేసీఆరే కారణం సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ర్యాలీ నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు! కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే! కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ అచీవర్స్ పాఠశాలలో ఘనంగా కాలుష్య రహిత దీపావళి వేడుకలు వికసిత్ భారత్ @ 2047లో  యువ సంవాద్ . గాజువాకలో వ్యక్తి అనుమానాస్పద మృతి

ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి – పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆడే ప్రకాష్

Select Suryaa Now
ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి  – పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆడే ప్రకాష్
సూర్య జైనూర్: సిర్పూర్ (యు) మండలంలోని ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష ( స్ స్ ఏ ) ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీఆర్‌టీయూ టీఎస్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆడే ప్రకాష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను వెంటనే అమలు చేయాలని, కేజీబీవీ సీఆర్‌టీ ఉపాధ్యాయులకు వేసవి సెలవుల కాలానికి వేతనాలు కట్ చేయకుండా చెల్లించాలని కోరారు. కేజీబీవీ, ఎంఆర్‌సీ సిబ్బందికి హెల్త్ కార్డులు వర్తింపజేయడంతో పాటు పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.అలాగే వర్క్ అడ్జస్ట్మెంట్‌ను విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేపట్టాలని, గతంలో నిర్వహించిన వర్క్ అడ్జస్ట్మెంట్‌ను సవరించాలని, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సమగ్ర శిక్ష కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ ప్రకటించాలని కోరారు.మహిళా ఉపాధ్యాయులకు తమకు అనుకూలమైన వారంలో ఒక రోజు వీక్లీ ఆఫ్ వినియోగించుకునే అవకాశం కల్పించాలని, గత ఏడాది సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, పాఠశాలల ప్రారంభ సమయాన్ని ఉదయం 9:30 గంటలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఈ. భూమన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రాథోడ్ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్రం దత్తు తదితరులు పాల్గొన్నారు.