BREAKING
నేరడిగొండ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం సిద్దిపేట డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి - టీఎంయూ రాష్ట్ర నాయకుల డిమాండ్ ఆళ్లగడ్డ మండలంలో కూటమి ప్రభంజనం ఐవీవై పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు కీర్తి సురేష్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ 'అక్క' వెబ్ సిరీస్: మాతృస్వామ్య నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వచ్చునూరు గ్రామ మాజీ సర్పంచ్ పారమిత విద్యాసంస్థలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు వ్యూహం ఫలించింది...ఆశించిన ఎంపీపీ పీఠం దక్కింది! పాలమూరు ఎడారిగా మారడానికి కేసీఆరే కారణం సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ర్యాలీ నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు! కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే! కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ అచీవర్స్ పాఠశాలలో ఘనంగా కాలుష్య రహిత దీపావళి వేడుకలు వికసిత్ భారత్ @ 2047లో  యువ సంవాద్ . గాజువాకలో వ్యక్తి అనుమానాస్పద మృతి జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థిని సాహితి

తిరిగి ఓటు హక్కును పొందేoదుకు మరో అవకాశం - అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్

Select Suryaa Now
తిరిగి ఓటు హక్కును పొందేoదుకు మరో అవకాశం  - అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగింపునకు గురైన వారికి తమ ఓటు హక్కును తిరిగి పొందేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు.శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఎస్‌డీ జాబితాలో పేర్లు ఉన్నవారు మరోసారి ఎన్యుమరేషన్ ఫారం నింపి సమర్పించడం ద్వారా ఓటరు జాబితాలో తమ పేరును పునరుద్ధరించుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్న అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్ మాట్లాడుతూ, ఏఎస్‌డీ జాబితాను ప్రతి పోలింగ్ కేంద్రం, గ్రామపంచాయతీ నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు, ఓటర్లందరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఏఎస్‌డీ జాబితాలో పేర్లు ఉండి, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు నిబంధనల ప్రకారం ఫారం-సి ద్వారా మరోసారి ఎన్యుమరేషన్ ఫారం సమర్పించవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియపై నియోజకవర్గ, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పూర్తి వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా చర్యలు చేపట్టి, ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు గురైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు రెవెన్యూ కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, డీఆర్ఓ స్రవంతి, ఎన్నికల పర్యవేక్షణ అధికారి నలందప్రియ, నాయబ్ తహసీల్దార్ మధుసూదన్, వివిధ మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.