telangana
జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థిని సాహితి
సూర్య కరీంనగర్ : శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థిని మాదిరె సాహితి (ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం – MPC) జాతీయ స్థాయి రగ్బీ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అకాడమీకి, జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చింది.న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో జరిగిన SGF అండర్-19 జాతీయ స్థాయి రగ్బీ క్రీడా పోటీలకు ఎంపికై, జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో పోటీపడి ఉత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడం విశేషం.ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి సాహితిని అభినందించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి అకాడమీకి గుర్తింపు తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల సెక్రటరీ సాయి చైతన్య రెడ్డి, శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ప్రిన్సిపాల్ పల్లె శ్యాంసుందర్ రెడ్డి, ఫిజికల్ అడ్వైజర్ లెంకల మహిపాల్ రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి , ఏజీఎం శ్రీనివాస్ , కోచ్ దీకొండ శివరామకృష్ణ పాల్గొని సాహితిని అభినందించారు.