BREAKING
మాస్కోలోని డచ్ రాయబార కార్యాలయం సమీపంలో భారీ కుడ్యచిత్రం ఫ్రెంచ్ నటుడు జెరార్డ్ డిపార్డియూపై అత్యాచార కేసు విచారణకు పారిస్ కోర్టు ఆమోదం బ్రిటిష్ పౌండ్ స్థిరత్వం.. అమెరికా డాలర్ ర్యాలీకి బ్రేక్ స్విట్జర్లాండ్‌లో ఐదు సైబర్ దాడులలో ఏఐ ఏజెంట్ల వినియోగం ఫిఫాపై సైబర్ దాడి ఇరాన్ యుద్ధం, ఇంధన ధరల షాక్.. ఆర్థిక సంక్షోభంలో విమానయాన సంస్థలు ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు" రాజ్యాంగ దినోత్సవ వేడుకలు " టెక్సాస్ జడ్జి నామినేషన్‌లో ట్రంప్ కీలక మార్పు పిరాట్లంక అభివృద్ధే కూటమి లక్ష్యం గ్రామ ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కమతం సాంబశివరావు సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది..

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, క్రీడా వైభవాన్ని ప్రపంచానికి చాటాలి - కలెక్టర్ రాజర్షిష

Select Suryaa Now
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, క్రీడా వైభవాన్ని ప్రపంచానికి చాటాలి - కలెక్టర్ రాజర్షిష
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలు, క్రీడా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు యువతలో విజ్ఞానం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఖేలో తెలంగాణ గ్లోబల్‌ క్విజ్‌’లో విద్యార్థులు, యువత, క్రీడాభిమానులు, ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా పిలుపునిచ్చారు.
8వ ఖేలో ఇండియా క్రీడల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ ఆన్‌లైన్‌ క్విజ్‌లో తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు kheloquiz.telangana.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.డిసెంబర్‌ 23 వరకు రోజుకు ఒకసారి చొప్పున గరిష్ఠంగా 10 సార్లు క్విజ్‌లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. మొత్తం 20 ప్రశ్నలతో నిర్వహించే పోటీలో క్రీడలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యాటకం తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు.క్విజ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌, 15 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికి మెరిట్‌ సర్టిఫికెట్‌ అందజేస్తారని తెలిపారు. రోజువారీ పోటీల్లో మొదటి ముగ్గురు విజేతలకు ప్రత్యేక బహుమతులు ఉంటాయని వెల్లడించారు.తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటడంతో పాటు యువతలో విజ్ఞానాన్ని, క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజర్షి షా కోరారు.