BREAKING
పాతూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మేయర్ వసీం ఆత్మకూరు అభివృద్ధే లక్ష్యం, కూటమి అభ్యర్థుల విజయమే సంకల్పం! హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్.. నామినేషన్ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి అభివృద్ధిని చూసే ప్రజలు మన వైపు ఉన్నారు : షరణి పొంగూరు నల్లచెరువు జడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ నామినేషన్* *జిల్లాలో సరికొత్త రాజకీయ పరిణామం* *ఎమ్మెల్యేలు కందికుంట, ఎంఎస్ రాజుతో కలిసి శ్రీరామ్ నామినేషన్* *స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్న శ్రీరామ్* తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట పనుల వేగవంతానికి ఆదేశాలు చిన్న మొక్కపల్లి 2 ఎంపీటీసీ అభ్యర్థిగా వేణుగోపాల్ వేమవరం ఎంపీటీసీ అభ్యర్థిగా యలమర్తి అనిత నామినేషన్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బి ఆర్ ఎస్ శ్రేణుల ఆందోళన సొంతింటి కల నెరవేరే వరకు సీఐటీయూ పోరాటం ఆగదు - సీఐటీయూ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి నామినేషన్‌కు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులపై రాళ్లదాడి బీసీ-ఏ కేటగిరీ పరిరక్షణకై సమరం - 7% రిజర్వేషన్లు హరించుకుపోతాయని తీవ్ర ఆందోళన ప్రొద్దుటూరులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఆందోళన.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం కొత్తగూడ లో ఉచిత కంటి వైద్య శిబిరం మందమర్రి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

స్వీయ జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించాలి.. భూదాన్ భూముల రికార్డులను నవీకరించాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి

Select Suryaa Now
స్వీయ జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించాలి.. భూదాన్ భూముల రికార్డులను నవీకరించాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : విద్యావంతులు, ఉద్యోగులు స్వీయ జనగణనలో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అధికారులు ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి సూచించారు. జనగణన–2027 రెండో దశను సమర్థవంతంగా, పారదర్శకంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా, సబ్‌ డివిజనల్, ఛార్జ్ అధికారులు, అదనపు ఛార్జ్ అధికారులకు జనగణనపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.జనగణన ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని, సేకరించే వివరాలు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వికారాబాద్, మోమిన్‌పేట్, నవాబ్‌పేట్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్, కోట్‌పల్లి, తాండూరు ప్రాంతాల సహాయ జనగణన అధికారులు విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 1,600 మంది ఎన్యూమరేటర్లు, 271 మంది సూపర్‌వైజర్లు సమర్థవంతంగా పనిచేసేలా ఛార్జ్ అధికారులు, అదనపు ఛార్జ్ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.అనంతరం భూదాన్ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, భూ రికార్డులను పరిశీలించి తాజా సమాచారంతో నవీకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.భూదాన్ భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేసి, వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు. భూముల రికార్డులను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించడం ద్వారా భూముల పరిరక్షణతో పాటు అర్హులైన లబ్ధిదారుల ప్రయోజనాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఓ వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ప్రణాళిక శాఖ రిటైర్డ్ డైరెక్టర్ దయానంద్, ఏడీ రవిచంద్ర, శిక్షణాధికారి జంగయ్యతో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు