BREAKING
సాయంత్రం 5 గంటల వరకే ఎంపీటీసీ నామినేషన్లు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా -సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కె గంగవరం జడ్పీటీసీగా చింతా అనురాధ బంట్వారం వద్ద తీవ్ర విషాదం: మైనింగ్ క్వారీలో పడి కర్ణాటకకు చెందిన ఇద్దరు మృతి ఆత్మకూరులో టీడీపీలోకి భారీగా చేరికలు తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నిర్ణయాలపై బీసీఐ స్టే.. పారదర్శకతకు ప్రాధాన్యం పొదలకూరు బిట్‌–3 ఎంపీటీసీ అభ్యర్థిగా కోవూరు వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీని సన్మానించిన యూనిక్ కంపెనీ బాధితులు గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు. పలమనేరు 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగరాజా ప్రచారం పిచ్చికుక్కల స్వైరవిహారం - రెండు ఆవు దూడలపై దాడి 23 మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపునకు షెడ్యూల్ విడుదల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి సహకరించండి ముస్లిం సోదరులను ఓటు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే అమిలినేని కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో కలిసి విస్తృత ప్రచారం శ్రీ బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు - మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

కర్జెల్లి లో నిధుల దుర్వినియోగంపై విచారణ వేగవంతం - డి ఎల్ పి ఓ హరిప్రసాద్

Select Suryaa Now
కర్జెల్లి లో నిధుల దుర్వినియోగంపై విచారణ వేగవంతం -  డి ఎల్ పి ఓ హరిప్రసాద్
సూర్య, చింతలమానేపల్లి : కర్జెల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధుల మళ్లింపుపై వచ్చిన ఆరోపణలతో అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం కర్జవెల్లి గ్రామ పంచాయతీని డివిజనల్ పంచాయతీ అధికారి (డి ఎల్ పి ఓ) హరిప్రసాద్ సందర్శించి, ఆర్థిక లావాదేవీలు, క్యాష్ బుక్స్, వోచర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.గ్రామానికి మంజూరైన ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలపై అధికారులు ఆరా తీశారు. నిధులు ఏయే పనులకు కేటాయించారు? ఎవరెవరి ఖాతాలకు నగదు బదిలీ అయింది? అనే అంశాలపై రికార్డులను పరిశీలిస్తూ సంబంధిత అధికారులను, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డి ఎల్ పి ఓ హరిప్రసాద్ స్పష్టం చేసినట్లు సమాచారం. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. కర్జెల్లి గ్రామ పంచాయతీలో నిధుల లావాదేవీలపై జరుగుతున్న విచారణ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విచారణ నివేదికలో ఏయే అంశాలు వెలుగులోకి వస్తాయి? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది వేచి చూడాలి.